మా గురించి

సేంద్రియఉత్పతుల అమ్మకాలకు వీలు కల్పించటం

ప్రపంచ వ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, వ్యవసాయ శాఖ మరియు ఎం.ఎస్.టి.సి వారి సహకారంతో జైవిక్ ఖేతి పోర్టల్ రూపొందించబడినది. ఈ పోర్టల్ ద్వారా సేంద్రియ రైతులు తమ ఉత్పత్తులను అమ్మడానికీ, సేంద్రియ వ్యవసాయాన్ని, దాని ప్రయోజనాలను ప్రోత్సహించడానికి వీలవుతుంది.

1

2

జైవిక్ ఖేతి పోర్టల్ అనేది ఆన్ లైన్ వ్యాపారం చేయటానికే కాకుండా సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించే వేదిక. ఈ పోర్టల్ లోని జ్ఞాన భాండాగారం విభాగం లో కధనాలు, వీడియోలు, ఉత్తమ వ్యవసాయ పద్ధతులు, విజయ గాధలు మరియు సేంద్రియ వ్యవసాయానికి ఉపయోగపడే  ఇతర విషయాలు అన్ని పొందుపరచపడ్డాయి. ఆన్ లైన్ - వ్యాపార విభాగం లో ధాన్యాలు , పప్పు ధాన్యాలు , కూరగాయలు వంటి మొత్తం సేంద్రియ ఉత్పత్తుల వివరాలను అందిస్తుంది.

కొనుగోలుదారులు తమకు కావలసిన సేంద్రియ ఉత్పత్తులను అతి తక్కువ ధరలకు ఇంటివద్దనుండి కొనుగోలుచేయవచ్చు. సేంద్రియ రైతులు పగలు రాత్రి కష్టపడి ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను నేరుగా రైతుల పొలాల నుండి వినియోగ దారుల ఇంటి వద్దకు మార్కెట్ ధరలతో పోల్చినప్పుడు అతి తక్కువ ధరలకు అందించడం ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశం.

3

4

ఈ పోర్టల్ వివిధ వాటాదారులు అనగా ప్రాంతీయ మండలులు, స్థానిక సంఘాలు , వ్యక్తి గత రైతులు, కొనుగోలుదారులు ప్రభుత్వ సంస్థలు మరియు వ్యవసాయ ఉత్పాదకాల సరఫరాదారులు -  అందరి వివరాలను జోడిస్తుంది. తద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని అభివృద్ధి పరచడం మరియు ప్రోత్సహించడం కోసం కృషిచేస్తుంది.

ఈ జైవిక్ ఖేతి పోర్టల్ ద్వారా రైతులకు  వారి ఉత్పత్తులకు ఉత్తమ ధరలను అందించడానికి మేము ధరలను శాస్త్రీయముగా నిర్ణయంచే పద్ధతులు ద్వారా  ముందస్తు,వేలం, ధర మరియు పరిమాణమును వేలంపాట, పుస్తకముల నమోదుచేయటం  మరియు రివర్స్ వేలం వంటి వ్యవస్థలను రైతులకు అందిస్తాము.

5

మేము అందించే సదుపాయాలు
కొనుగోలుదారు నమోదు

కొనుగోలుదారులుగా చేరేఅవకాశం వున్న వారు తమకు కావలిసిన ఉత్పత్తులను ఎంచుకోవడానికి పోర్టల్ నందు లాగిన్ అవ్వవలసిన అవసరం లేదు. అయితే వారు ఏదైనా ఉత్పత్తిని కొనటానికి సిద్ధంగా ఉన్నప్పుడు పోర్టల్ లో నమోదు చేసుకోవాలి లేదా లాగిన్ అవ్వాలి.

రైతు / విక్రేయదారుడి నమోదు

ఒక రైతు (ఆమె లేదా అతడు ) పోర్టల్ లో నమోదు చేసుకోవచ్చు. ఒకసారి నమోదు చేసుకున్న తరువాత ఈ (ఆన్ లైన్)బజార్ లో ఉత్పత్తి వివరాలు, ఉత్పత్తుల సరఫరా పద్దతి, మరియు ధర చెల్లింపు సమాచారం వివరాలను నింపడం ద్వారా తమ ఉత్పత్తులను అప్ లోడ్ చేయవచ్చు.

స్థానిక సంఘాల నమోదు

ఒక రైతు సంఘం, దానిలో సభ్యులుగా వున్న రైతులందరినీ నమోదు చేయవచ్చు. గ్రూప్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉపయోగించి గ్రూప్ లీడర్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత, సంఘ నాయకుడు తన తరపున లేదా సంఘ లోని ఇతర రైతుల తరపున ఉత్పత్తుల వివరాలను అప్‌లోడ్ చేయవచ్చు.

వ్యవసాయ ఉత్పాదకాల సరఫరాదారు నమోదు

వ్యవసాయ ఉత్పాదకాల సరఫరాదారు నమోదు

బిడ్డింగ్/వేలంపాట

ఆన్ లైన్- (ఇ)బజార్ నుండి రెగ్యులర్ కొనుగోలు కాకుండా, కొనుగోలుదారులు అమ్మకందారుల ద్వారా లభించే ఉత్పత్తులపై వేలంపాట ద్వారా కూడా ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. పుస్తకాల నమోదు, ధర-పరిమాణం మరియు రివర్స్ వేలం అనే మూడు పద్ధతుల ద్వారా మేము బిడ్డింగ్ ప్రక్రియకు వీలు కల్పిస్తాము .

కొనుగోలుదారుకు మార్గదర్శకాలు(గైడ్)

ఫీచర్ చేసిన షాపింగ్ ఫలితాలను ఎన్నుకునేటప్పుడు (వస్తువు రకము, ధర, సరఫరా చేసే పద్దతి, రాష్ట్రం, జిల్లా మరియు ధృవీకరణ వంటివి), లభ్యత, ఖర్చులు మరియు ఆ ఉత్పత్తి ఆసక్తికరమైనదా కాదా అనే దానితో సహా అనేక రకాల అంశాలు దీనిలో ఉన్నాయి.